ప్రెస్ మీట్ : షాకింగ్ విషయాలు చెప్పిన వివేకా కూతురు సునీత

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని పోలీసులు అదుపులోని తీసుకొని విచారిస్తున్నారు. పరమేశ్వర్ రెడ్డి, అతని భార్యని అదుపులోని తీసుకొన్నారు. నాలుగు నెలల క్రితం ఓ మహిళ విషయంలో రంగేశ్వర్ రెడ్డిని చంపిన దిద్దికుంట శేఖర్ పోలీసులు అదుపులోని తీసుకొన్నారు. సిట్ అధికారులు దర్యాప్తుని వేగవంతం చేశారు.

ఈ నేపథ్యంలో తాజాగా వివేకానందరెడ్డి కూతురు సునీతా రెడ్డి మీడియా ముందుకు వచ్చారు. హత్య జరిగిన 5రోజుల తర్వాత వివేకా కూతురు సునీత మీడియా ముందుకు వచ్చారు. “నాన్న గౌరవంగా బతికారు. పులివెందుల ప్రజలంటే ఆయనకి అభిమానం. ఫ్యామిలీ కంటే ఎక్కువగా పులివెందులకి ప్రాధాన్యతనిచ్చేవారు. ఆయన చనిపోయిన బాధకంటే.. ఆ తర్వాత జరిగిన ప్రచారం ఎంతో బాధ కలిగిచింది అన్నారు సునీత. అన్ని విషయాలు దర్యాప్తులు తేలుతాయి. ఎవరి ప్రభావం లేకుండా ఫెయిర్ ఇన్విస్టిగేషన్ జరగాలి” అన్నారు సునీత.

తండ్రి హత్య విషయంలో మీ అనుమానాలేంటీ ? అని అడగగా.. మా అనుమానాలు, అభిప్రాయాలతో పనేంటీ.. ? అన్ని విషయాలు దర్యాప్తులో తేలుతాయన్నారు. వివేకా రాసిన లేటర్ ఆయన హ్యాడ్ రైటింగ్ కాదని ప్రచారం జరుగుతుండటంపై సునీత స్పందించారు. ఆ విషయం ఫొరెన్సిక్ టెస్టులో తేలుతుంది. సిట్ దర్యాప్తు జరుగుతుండగా.. అది ఫ్యామిలీ హత్యని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా అంటారని సునీత ప్రశ్నించారు. దర్యాప్తులో అన్ని విషయాలు తేలుతాయని తెలిపారు.