తమ్ముడూ.. అన్నయ్య మెగాస్టార్’ని ఎప్పుడు పిలుస్తావ్ ?
తమ్ముడు పవన్ కళ్యాణ్ పిలిచాడు అన్నయ్య నాగబాబు జనసేన పార్టీలో చేరిపోయాడు. ఆయనకి నరసాపురం లోక్సభ స్థానాన్ని కేటాయించినట్టు పవన్ తెలిపాడు. నాగబాబు జనసేన తీర్థం పుచ్చుకోవడం పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఇందుకోసం ఆయన కొన్నాళ్లుగా గ్రౌండ్ వర్క్ చేసుకొన్నట్టు కనబడింది. ‘నా ఛానల్ నా ఇష్టం’ అనే యూట్యూబ్ ఛానల్ ని ఏర్పాటు చేసి.. తమ్ముడికి మద్దతుగా పొలిటికల్ సటైర్స్ వేశాడు నాగబాబు. తమ్ముడు ఉన్నాడనే ధైర్ఘ్యంతోనే ఇన్నాళ్లు ఆ పని చేశానని ఒప్పుకొన్నాడు కూడా.
ఇప్పుడు మెగా అభిమానులు, కాపు నేతల ఫోకస్ మెగాస్టార్ చిరంజీవిపై పడింది. ఆయన్ని పవన్ ఎప్పుడు జనసేనలోకి ఆహ్వానిస్తారని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. నాగబాబు మాదిరిగానే మెగాస్టార్ కు పవన్ నుంచి సడెన్ గా ఆహ్వానం అందే అవకాశం ఉన్నట్టు సమాచారమ్. ‘ప్రజారాజ్యం పార్టీ’ ఫెల్యూర్ స్టోరీ దృష్ట్యా అన్నయ్య మెగాస్టార్ ని జనసేన పార్టీకి దూరం ఉంచుతున్నాడే తప్పే మరో కారణం లేదని తెలుస్తోంది.
ఎన్నికల ప్రచారం ముగిసే ఒకట్రెండు రోజుల ముందైనా.. మెగాస్టార్ ని పార్టీలోకి ఆహ్వానించడమా.. ? లేదంటే.. ? ఆయనతో ప్రచారం చేయించడమా.. ?? అదీ కుదరకపోతే.. అన్నయ్యతో ఓ ప్రెస్ మీట్ పెట్టించే ఆలోచనలో పవన్ ఉన్నాడని సమాచారమ్. ఇక, ఎన్నికల తర్వాత ఫలితం ఎలా ఉన్నా.. అన్నయ్య మెగాస్టార్ ని సాదారంగా జనసేనలోకి ఆహ్వానించి ఆయనకి ఓ గౌరవప్రదమైన పదవిలో కూర్చోబెట్టే ఆలోచనలో పవన్ ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారమ్.