130 అసెంబ్లీ, 23లోక్ సభ స్థానాల్లో వైకాపా గెలుపు !


ఏపీలో రాబోయేది కచ్చితంగా వైకాపా ప్రభుత్వమే. ఈ సారి చంద్రబాబుకు ఓటమి తప్పదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. వైకాపా అధినేత జగన్ తమకు మిత్రుడని, ఆయన గెలుపునకి సహకారం అందిస్తామని బాహాటంగానే ప్రకటించాడు. ఇప్పుడు ఎన్నికలు దగ్గరపడుతుండటంతో జగన్ కి మైలేజీ తీసుకొచ్చే పనిని తెరాస నేతలు మొదలెట్టినట్టు కనబడుతోంది. మాట సాయంగా ఏపీలో ఈసారి జగన్ గెలుస్తడు. సీఎం అవుతడు అంటుర్రు గులాభి నేతలు

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాత్రం ఓ అడుగు ముందుకేసి ఈ సారి జగన్ బంపర్ మేజారిటీతో గెలవబోతున్నాడని లెక్కలు చెప్పాడు. బుధవారం మీడియాతో మాట్లాడిన తలసాని.. ఈ ఎన్నికల్లో వైకాపా 120 నుంచి 130 అసెంబ్లీ స్థానాలు, 22 నుంచి 23 లోక్‌సభ స్థానాల్లో గెలవబోతోందని వ్యాఖ్యానించారు. నిజంగానే తలసాని జోస్యం నిజమవుతా. ఈసారి ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందా ? తెలియాలంటే మే23 వరకు వెయిట్ చేయాల్సిందే. ఆరోజే లోక్ సభ ఎన్నికల ఫలితాలతో పాటు ఏపీ ఫలితం రానుంది.