ఒత్తిడిలో హాస్పిటల్’లో చేరిన విజయ్
హీరో విజయ్ దేవరకొండ ఆసుపత్రిపాలయ్యారు. విరామం లేకుండా షూటింగ్ లో పాల్గొనడంతో స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో చికిత్స కోసం విజయ్ ఆసుపత్రిలో చేరినట్లు విజయ్ ఓ ఆంగ్లపత్రికతో చెప్పారు.
“హోలీని చాలా గొప్పగా జరుపుకొన్నా. బుధవారం తెల్లవారుజామున ఆరు గంటల వరకూ నేను షూటింగ్‌లోనే ఉన్నా. దీంతో నాకు జర్వం వచ్చిందని అర్థమైంది. కానీ తొందరగా కోలుకోవాలి. అందుకే ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నా”నని తెలిపారు విజయ్.
ప్రస్తుతం విజయ్ ‘డియర్ కామ్రేడ్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహిస్తున్నారు. రష్మిక
మందన హీరోయిన్. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. దక్షిణాది అన్నీ బాషల్లోనూ డియర్ కామ్రేడ్ మే 31న విడుదల కానుంది.