జగన్ ఆస్తులు అప్పులు

వైకాపా అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ శుక్రవారం పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్ లో ఆస్తులు, అప్పులని పొందుపరిచారు. ఐతే, అఫిడవిట్ లో జగన్ కు తనకు సొంత కారు కూడా లేదని పేర్కొనడం విశేషం.

జగన్ కు రూ.339,89, 43, 352, ఆయన భార్య వైఎస్ భారతీరెడ్డి రూ. 92,53,49,352, జగన్ పెద్దకుమార్తె వైఎస్ హర్షిణిరెడ్డి రూ.6,45,62,191, చిన్నకుమార్తె వైఎస్ వర్షారెడ్డి రూ.4,59,82,372 చరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు. ఇక, జగన్ స్థిర ఆస్తుల విలువ రూ.35.30 కోట్లు. ఆయన భార్య వైఎస్ భారతి కి సంబంధించి స్థిర ఆస్తుల విలువ రూ.31.59 కోట్లుగా పేర్కొన్నారు.

బ్యాంక్ అకౌంట్లలో ఉన్న జగన్ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు

వైఎస్ జగన్ బ్యాంక్ అకౌంట్లలో నగదు వివరాలు:

1. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (బెంగళూరు) : రూ.20లక్షలు
2. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (బెంగళూరు) : రూ.కోటి 20 లక్షలు
3. ఎస్ బీఐ (హైదరాబాద్) : రూ.21లక్ష 44 వేలు
4. హెచ్.డి.ఎఫ్.సి (మల్కాజ్ గిరి) : రూ.25 వేలు

వైఎస్ భారతి బ్యాంక్ అకౌంట్లో నగదు వివరాలు :

1. యాక్సిస్ బ్యాంక్ ( బెంగళూరు) : రూ.9.70లక్షలు
2. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (బెంగళూరు) : రూ.5.73 లక్షలు
3. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (బెంగళూరు) : 20.90లక్షలు
4. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (బంజారాహిల్స్ ) : రూ.8.09లక్షలు
5.యాక్సిస్ బ్యాంక్ ( బెంగళూరు) : రూ.17.41లక్షలు
6. ఎస్ బీఐ (పులివెందుల) : రూ.21.37లక్షలు
7. యాక్సిస్ బ్యాంక్ ట్రావెల్ కార్డ్ : 1.09లక్షలు

వైఎస్ హర్షిణి రెడ్డి :
1. యాక్సిస్ బ్యాంక్ (బెంగళూరు) : రూ.70 లక్షలు
2. యాక్సిస్ బ్యాంక్ (బెంగళూరు) : రూ.51.38లక్షలు
3. నాట్ వెస్ట్ (లండన్ ) : రూ.2.05లక్షలు

వైఎస్ వర్షారెడ్డి :
1.యాక్సిస్ బ్యాంక్ (బెంగళూరు) : రూ.34 లక్షలు
2.యాక్సిస్ బ్యాంక్ (బెంగళూరు) : రూ.2.07లక్షలు

షేర్ల వివరాలు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ.317,45,99,618
వైఎస్ భారతి షేర్ల వివరాలు 62,35,01,849
వైఎస్ హర్షిణిరెడ్డి 1,18,11,358
వైఎస్ వర్షారెడ్డి 24,27,058

చిన్నమెుత్తాల పొదుపు, పాలసీలు
1. వైఎస్ జగన్- ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ 13.24 లక్షలు
2. వైఎస్ భారతి- ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ 10.21 లక్షలు
3. వైఎస్ భారతి- మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ 2.04 కోట్లు
4. వైఎస్ భారతి- టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ పాలసీ 24.04 లక్షలు

రావాల్సిన బకాయిలు చెల్లించాల్సిన అప్పులు
1. వైఎస్ జగన్ రూ.15.53 లక్షలు రూ.1.19 కోట్లు
2. వైఎస్ భారతి రూ. 1.02 కోట్లు రూ.2.45 కోట్లు

బంగారు ఆభరణాలు

1.వైఎస్ జగన్ :ఏమీ లేవు
2. వైఎస్ భారతి :3.57 కోట్లు విలువైన 5.862 కిలో గ్రాముల బంగారం, వజ్రాలు
3. వైఎస్ హర్షిణిరెడ్డి :3.16 కోట్లు విలువైన 4.187 కి.లోగ్రాముల బంగారం, వజ్రాలు
4. వైఎస్ వర్షారెడ్డి :3.12 కోట్లు విలువైన 3.45 కిలోల బంగారం, వజ్రాలు

వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల చేతిలో ఉన్న నగదు వివరాలు
వైఎస్ జగన్ చేతిలో రూ. 43,500 ఉండగా ఆయన భార్య వైఎస్ భారతి రెడ్డి చేతిలో రూ.49,390 లు ఉండగా ఆయన పెద్ద కుమార్తె హర్షిణిరెడ్డి చేతిలో రూ.7440 రూపాయలు ఉన్నట్లు అఫిడవిట్ లో పొందుపరిచారు.

వైఎస్ జగన్ స్థిర ఆస్థుల వివరాలు

1. వైఎస్ జగన్ కు సంబంధించి వ్యవసాయ భూమి విలువ రూ.42.44లక్షలు
2. వైఎస్ భారతికి సంబంధించి భూముల విలువ రూ.26.65లక్షలు

వ్యవసాయేతర భూముల వివరాలు
1. వైఎస్ జగన్ వ్యవసాయేతర భూముల విలువ రూ.8.42 కోట్లు
2. వైఎస్ భారతి వ్యవసాయేతర భూముల విలువ రూ.7.17 కోట్లు

కమర్షియల్ బిల్డింగ్స్ వివరాలు
1. వైఎస్ జగన్ కు చెందిన కమర్షియల్ బిల్డింగ్స్ విలువ రూ.14.46 కోట్లు
2. వైఎస్ భారతికి చెందిన కమర్షియల్ బిల్డింగ్స్ విలువ రూ.10.25 కోట్లు

నివాస భవనాలు
1. వైఎస్ జగన్ కు ఉన్న నివాస భవనాల విలువ రూ.11.99కోట్లు
2. వైఎస్ భారతి కి ఉన్న నివాస భవనాల విలువ రూ.13.89 కోట్లు

* ఏప్రిల్ 2019న వైఎస్ జగన్ కట్టాల్సిన జీఎస్టీ విలువ రూ.5.80 లక్షలు
* వైఎస్ భారతి కట్టాల్సిన జీఎస్టీ విలువరూ.27,824వేలు
* వైఎస్ జగన్ కు సంబంధించి చెల్లించాల్సిన వివాదాల్లోని బకాయిలు రూ.66.68 కోట్లు కాగా జగన్ భార్య వైఎస్ భారతి *  * చెల్లించాల్సిన వివాదాల్లోని బకాయిలు విలువ 6.75 కోట్లుగా అఫిడవిట్ లో పొందుపరిచారు.