వివేకా హత్య కేసు.. జగన్ అనుచరుడు అరెస్ట్ !

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య.. ఆయన కుటుంబ సభ్యులపనేనని టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇంటిదొంగలు చేసిన పనికి తమపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. ఇప్పుడీ కేసులో జగన్‌ ముఖ్య అనుచరుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే శివశంకర్‌రెడ్డిని పోలీసులు రెండు సార్లు విచారించారు. పులివెందులకు చెందిన నాగప్ప, ఆయన కుమారుడు శివను కూడా పోలీసులు అధికారులు ప్రశ్నిస్తున్నారు. కడపలోని ఓ రహస్య స్థావరంలో 15 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

వివేకా ముఖ్య అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, పరమేశ్వరెడ్డి, కిరాయి హంతకులు శేఖర్‌రెడ్డి ఈ హత్యకేసులో ప్రధాన నిందితులుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 40 మంది సాక్షులను పోలీసులు విచారించారు. సోమవారం లోపల కొందరు నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. దర్యాప్తులో వివేకా హత్య నిజంగా ఇంటి దొంగలపనే అని తేలినట్టయితే.. ఈ ఎన్నికల్లో వైకాపాకు గట్టి దెబ్బ పడినట్టే. మరోవైపు, ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని.. చిన్నాన్నకేసుని సీబీఐకి అప్పజెప్పాలని జగన్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.