హైదరాబాద్‌ పోరు ఓటమితో షురూ

ఐపీఎల్‌-12లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పోరు ఓటమితో షురు అయ్యింది. తొలి మ్యాచ్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ చేతిలో ఓటమి పాలైంది. డేవిడ్‌ వార్నర్‌ (85; 53 బంతుల్లో 9×4, 3×6) మెరవడంతో మొదట హైదరాబాద్‌ 3 వికెట్లకు 181 పరుగులు చేసింది.

182 విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా.. రసెల్‌ (49 నాటౌట్‌; 19 బంతుల్లో 4×4, 4×6), నితీష్‌ రాణా (68; 47 బంతుల్లో 8×4, 3×6) చెలరేరి ఆడటంతో.. కోల్‌కతా 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించింది.

18 బంతుల్లో 53 పరుగులు చేయాల్సిన స్థితిలో ఓటమి దిశగా సాగిన కోల్‌కతా నైట్‌రైడర్స్‌… ఆఖర్లో రసెల్‌ అనూహ్యంగా రెచ్చిపోవడంతో లక్ష్యాన్ని కోల్‌కతా 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రసెల్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.