కమల్ పోటీకి దూరం


తమిళ్ సూపర్ స్టార్, మక్కల్‌ నీది మయ్యమ్‌(ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు కమల్‌హాసన్ ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఎంఎన్‌ఎం అభ్యర్థుల రెండో జాబితాను కమల్ ఆదివారం ప్రకటించారు. పార్టీ మేనిఫెస్టోను కూడా విడుదల చేశారు. సమాన వేతనం, మహిళలకు రిజర్వేషన్లు, అందరికీ ఉద్యోగాలు లాంటి పలు అంశాలను మేనిఫెస్టోలో చేర్చారు.

రానున్న ఐదేళ్లలో 50 లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్నారు. మహిళలకు 50శాతం రిజర్వేషన్లు, ఫ్రీ వైఫై, రహదారులపై టోల్‌ రుసుముల రద్దు లాంటి పలు అంశాలపై మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా లోక్ సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని కమల్ తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో ఎంఎన్‌ఎం ‘రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా’తో కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.