పడుకొంటే నెలకు 50వేలు ఇస్తానన్నాడు
ఇండస్ట్రీలో ఇటీవలే కాస్టింగ్ కౌచ్ పై పెద్ద దుమారమే నడిచింది. జూనియర్, సీనియర్ హీరోయిన్స్ తమకు ఎదురైన లైంగిక వేధింపులపై స్పందించారు. ఇలాంటి వేధింపులు ఇప్పడే కాదు అప్పుడు కూడా ఉన్నాయని అంటున్నారు నటి కరాటే కళ్యాణి. ఆమె ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికల్లో ఈసీ మెంబర్ గా గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కరాటే కళ్యాణి.. కెరీర్ లో తాను ఎదుర్కొన్న ఒడిదుకులని పంచుకొన్నారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై స్పందించారు.
కాస్టింగ్ కౌచ్ అన్నది ఒక్క సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాదు.. మహిళలు పని చేస్తున్న పని చోట ఉంది. సాఫ్ట్ వేర్ లాంటి ఇండస్ట్రీలో అమ్మాయిలపై చేతులు వేసినా, ముద్దు పెట్టుకున్నా పెద్దగా ఎవరూ పట్టించుకోరు. అదే సినీ ఇండస్ట్రీలో అది పెద్ద గందరగోళం అవుందన్నారు కళ్యాణీ. కెరీర్ ప్రారంభంలో ఇండస్ట్రీకి చేందిన ఓ వ్యక్తి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నెలకు 50 వేలు జీతం ఇస్తాను. పడుకోవాలి. అందుకు తగ్గట్లుగా బాండ్ రాయమని అడిగాడని తెలిపింది. అది నేను నిరాకరించాను. అందుకే ధైర్ఘ్యంగా ఇప్పుదు మాట్లాడుతున్నానని చెప్పింది. ఐతే, ఇప్పుడా నటుడు ఫేడ్ అవుటయ్యాని తెలిపింది. ఇంతకీ ఆ ప్రబుద్దుడు ఎవరో.. ?