మామ పేరుతో సమంత బిజినెస్ చేస్తోందా ?

అక్కినేని కోడలు సమంత బిజినెస్ చేస్తోంది. ఐతే, తన పేరు మీద కాదు. మామ నాగార్జున పేరు మీద బిజినెస్ చేస్తోంది. ఈ విషయం ఇప్పటి వరకు ఎవ్వరికీ తెలీదు. ఇంతకీ సామ్ చేస్తున్న బిజినెస్ ఏంటో తెలుసా ? ఆమె నిర్మాతగా మారింది. అవునూ.. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున్ హీరోగా ‘మన్మథుడు2’ తెరకెక్కబోతుంది. ఈ సినిమా ఇవాళే ప్రారంభోత్సవం కూడా జరుపుకొంది.

ఈ సినిమా అన్నపూర్ణ స్టూడియోస్ పై తెరకెక్కడం లేదు. నాగార్జునకు చెందిన మరో నిర్మాణ సంస్థ ‘మనం ఎంటర్ ప్రైజెస్’పై తెరకెక్కుతోంది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. నాగార్జున, జెమినీ కిరణ్ నిర్మాతలు అన్నమాట. ‘మన్మథుడు2’కి నాగ్ పేరుకే నిర్మాత.. వ్యవహారాలన్ని సమంత చూసుకోబోతుందట. దర్శకుడు రాహుల్ రవీంద్రన్ సామ్ కి స్నేహితుడు. అందుకే ఆయన సినిమాతోనే సామ్ తొలిసారి నిర్మాణ బాధ్యతలని మీద వేసుకోబోతుందట.

సింపుల్ చెప్పాలంటే మామ నాగార్జున పేరుతో కోడలు సమంత బిజినెస్ చేస్తోంది. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ‘మన్మథుడు’ సినిమాతో పోలిక లేకపోయినా.. ఆ సినిమాని మించే వినోదాన్ని రెండో మన్మథుడు పంచబోతున్నట్టు తెలుస్తోంది. దసరాకు మన్మథుడు 2 ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.