నిహారికతో ప్రచారం.. విజయ్ కి ఇష్టంలేదు !


హీరో విజయ్ దేవరకొండ చాలా షార్ప్. ఆయన, ఆయన సినిమాలపై వచ్చే విమర్శలని కూడా ప్రచార అస్త్రాలుగా మార్చుకొనే తెలివైన హీరో. సూర్యకాంతం(నిహారిక)తో కూడా విజయ్ అంతే తెలివిగా వ్యవహరించినట్టు కనబడుతోంది. బి.ప్రణీత్‌ దర్శకత్వంలో నిహారిక – రాహుల్‌ విజయ్‌ జంటగా నటించిన చిత్రం ‘సూర్యకాంతం’. ఈ వారమే (మార్చి 29) సూర్యకాంతం ప్రేక్షకుల ముందుకు రానుంది.

శనివారం హైదరాబాద్ లో జరిగిన ‘సూర్యకాంతం’ ప్రీ రిలీజ్ వేడుకకి విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, సాయి తేజు.. అందరూ ఉండగా.. విజయ్ నే ఎందుకు సూర్యకాంతం కు చీఫ్ గెస్ట్ గా మారాడు అనే కామెంట్స్ వినిపించాయ్. దీని వెనక నిహారిక ఆసక్తి, లేదంటే మెగా ఫ్యామిలీ ప్లానింగ్ ఏమైనా ఉందా ? డౌట్లు వచ్చాయ్

వీటికి విజయ్ దేవరకొండ చాలా తెలివిగా చెక్ పెట్టాడు. సూర్యకాంతం ఆడియో వేదికపై మాట్లాడిన విజయ్.. ప్రస్తుతం మెగా హీరోలు రామ్ చరణ్, బన్నీ, వరుణ్ తేజ్, సాయితేజ్.. ఎవ్వరు అందుబాటులో లేకపోవడంతో తాను రావాల్సి వచ్చిందన్నారు. గీత గోవిందం
లో నాగబాబుతో నటించాను. ఆయనపై ఫాదర్ ఫీలింగ్ కలిగింది. నిహారిక పెద్ద అన్నయ్యలా వచ్చానన్నారు.

దీంతో.. ఇప్పుడు, భవిష్యత్ తో నిహారికతో లింకుపెట్టి జరిగే ప్రచారానికి విజయ్ ముందుగానే చెక్ పెట్టినట్టయింది. మొత్తానికి.. నిహారికతో బ్యాడ్ ప్రచారం జరగడం విజయ్ కి అస్సలు ఇష్టం లేదు. అది మెగా ఫ్యామిలీ, తనకు కూడా మంచిది కాదని విజయ్ భావించి ఉంటాడు. అందుకే విజయ్ చాలా తెలివిగా మాట్లాడని.. ఆయన నిజంగా షార్ప్ అనే ప్రశంసలు కురుస్తున్నాయ్.