ఎన్నికల ప్రచార అస్త్రంగా.. మహేష్ జీఎస్టీ !
సూపర్ స్టార్ మహేష్ బాబుని చాలా తెలివిగా ఎన్నికల ప్రచారం కోసం వాడుకొంటున్నాడు ఆయన బావ, ఎంపీ గల్లా జయదేవ్. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ లోక్ సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాసం చర్చలో గల్లా జయదేవ్ ప్రసంగం హైలైట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా ప్రత్యేక హోదాపై పలుమార్లు జయదేవ్ గట్టిగానే మాట్లాడారు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తనని టార్గెట్ చేసింది. తన కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను టార్గెట్ చేశారు.
వారిపై ఐటీ దాడులు నిర్వహించారు. మహేష్ బాబుకుపై ఐటీ దాడులు జరుగడం, మహేష్ థియేటర్ ‘ఎఎంబీ’ జీఎస్టీ వివాదం వెనక కూడా అసలు కారణాలివేనని తాజా ఎన్నికల ప్రచారంలో జయదేవ్ ఆరోపించారు. మొత్తంగా మహేష్ అభిమానుల మద్దతుని కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు జయదేవ్. ఆ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయ్. ప్రిన్స్ ఫ్యాన్స్ జయదేవ్ కి అండగా నిలిచి గెలిపిస్తారా అన్నది చూడాలి.