ముద్దు పెట్టు.. హిట్టు కొట్టు !
ముద్దు వద్దని ఎవరంటారు ? అవకాశం వస్తే జుర్రేసుకోవడమే. హీరో విజయ్ దేవరకొండ అదే చేశాడు. హీరోయిన్ రష్మిక మందన పెదాలని మరోసారి జుర్రేసుకొన్నాడు. వీరిద్దరు కలిసి నటిస్తున్న రెండో సినిమా ‘డియర్ కామ్రేడ్’. భరత్ కమ్మ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా మే31న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన వస్తోంది. ఇందులో విజయ్-రస్మికల లిప్ లాక్ సీన్ హైలైట్ గా నిలిచింది. ఈ ఒక్క సీన్ సినిమాపై అంచనాలని అమాంతం పెంచేసింది. ఈ ముద్దు సీన్ ని సెంటిమెంట్ గా భావించి పెట్టారనే ప్రచారం జరుగుతోంది. విజయ్-రస్మిక జంటగా నటించిన ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇందులో లిప్ లాక్ సీన్ సూపర్ హిట్.
విజయ్-రస్మిక ముద్దు పెట్టుకోవడమే కాదు.. ఆ ముద్దు సీన్ చుట్టూనే కథని నడిపించి ఆకట్టుకొన్నాడు దర్శకుడు పరశురామ్. ఇప్పుడిదే సెంటిమెంట్ తో ‘డియర్ కామ్రేడ్’లో ముద్దు సీన్ పెట్టారని చెప్పుకొంటున్నారు. దీనిపై రస్మిక స్పందించింది. “లిప్‌లాక్ సన్నివేశం ఆధారంగా ఓ సినిమాని ఎలా అంచనా వేస్తారు ? అది కరెక్ట్ కాదు. సినిమాలోని సన్నివేశం ముద్దుని డిమాండ్ చేసింది. నా పాత్రకు న్యాయం చేయాలంటే ఆ సీన్‌లో నేను నటించాలి. అందుకే నటించా”నని తెలిపింది.