‘మహర్షి’ తొలి సాంగ్ వింటారా.. ?

మహర్షి తొలి సాంగ్ వింటారా.. ? అందుకు ఈనెల 29వరకు ఆగాల్సిందే. సూపర్ స్టార్ మహేష్ మహర్షిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు-పివిపి-అశ్వినీదత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 9న మహర్షి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. సినిమాలోని మొదటి పాట #ChotiChotiBaatein ఈ నెల 29న రిలీజ్ చేయబోతున్నారు.

తాజాగా, ఈ విషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు వంశీపైడిపల్లి మహర్షి కొత్త పోస్టర్ ని షేర్ చేశారు. ఈ నెల 29 నుంచి మహర్షి ప్రయాణం ప్రారంభం కానుందని తెలిపారు. ఆరోజు ఉదయం 9:09నిమిషాలకు మహర్షి ఫస్ట్ సింగిల్ #ChotiChotiBaatein రాబోతుంది. మహేష్, అల్లరి నరేష్, పూజా హెగ్డేల స్నేహాన్ని సెలబ్రేట్ చేసుకొనేందుకు రెడీగా ఉండండని వంశీ ట్విట్ చేశారు. పోస్టర్’లో మహేష్, అల్లరి నరేష్, పూజాహెగ్డేలు సముద్రం ఒడ్డిన నిలబడి ఉన్నారు.

మహర్షి మహేష్ మూడు విభిన్న గెటప్ లో కనిపించబోతున్నాడు. లేజీ స్టూడెంట్, బిజినెస్ మేన్, రైతుగా మహేష్ కనిపిస్తాడని తెలిసింది. ఇందులో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఉగాధి కానుకగా ఏప్రిల్ 6న మహర్షి టీజర్ ని విడుదల చేయబోతున్నట్టు సమాచారమ్.