బన్నీ సినిమా.. కొత్తగా పాత ముచ్చట !
స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా కోసం అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ‘నా పేరు సూర్య’ తర్వాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో బన్నీ సినిమా అన్నారు. కథ రెడీ అవుతోందన్నారు. విక్రమ్ రెడీ చేసిన కథ బన్నీకి నచ్చలేదన్నారు. బన్నీ కోసం విక్రమ్ కొత్త కథ వండుతున్నారు అన్నారు. ఆ పని ఇంకాస్త లేటయ్యేలా ఉంది. కాస్త ఓపిక పట్టండని స్వయంగా బన్నీనే అభిమానులని బుజ్జగించారు. ఆ తర్వాత విక్రమ్ సినిమా పక్కకు పోయింది. త్రివిక్రమ్ తో బన్నీ సినిమా ఓకే అయింది. అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అది వచ్చి మూడ్నాలుగు నెలలు అయినా సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు.
బన్నీ సినిమా ఎప్పుడు అనే ఓపిక కూడా ఆయన అభిమానులకి లేదు. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్-బన్నీ సినిమాని నిర్మించబోతున్న హారిక & హాసిని నిర్మాణ సంస్థ తాజాగా ఓపిక చేసుకొని సినిమా ముచ్చట చెప్పింది. అదీ పాత మాటే. కొత్తగా చెప్పారంతే. “సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. అన్ని పనులు పూర్తవగానే మేము మీకు చిత్రానికి సంబంధించిన విశేషాలన్నీ తెలియజేస్తాం. అప్పటి వరకూ ఓపికగా ఉండండి. త్వరలోనే అన్ని అప్‌డేట్స్‌తో మీ ముందుంటాం. మీలాగే మేము సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నాం” అన్నారు. ఐతే, ఈసారి నమ్మాల్సిందే. త్వరలో బన్నీ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
As the pre-production works are going on at full swing, we will only be able to share once everything is concrete. Kindly, bare with us until such day.
Very soon, we will come up with all the updates!@GeethaArts @vamsi84
2/2
— Haarika & Hassine Creations (@haarikahassine) March 28, 2019