ఈసారి వర్మని గట్టిగా నమ్ముతున్నాం.. !
ఈసారి ప్రేక్షకులు రామ్ గోపాల్ వర్మని గట్టిగా నమ్ముతున్నారు. ఆయన కచ్చితంగా ఎన్టీఆర్ జీవితంలోని నిజాలని చూపిస్తారని వందశాతం నమ్ముతున్నారు. ఈ విషయంలో దర్శకుడు క్రిష్ నిరాశపరిచాడు. ఆయన ఎన్టీఆర్ బయోపిక్ ని అద్భుతంగా తీసినా.. దాని వెనక చంద్రబాబు, నందమూరి కుటుంబ ఉండటంతో నిజాలు బయటికిరాలేదని ప్రేక్షకులు నిరాశపడ్డారు.
ఆ అసలు నిజాలని నేను చూపిస్తానని రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీసుకొన్నారు. ఎన్టీఆర్ జీవితంలోని లక్ష్మీ పార్వతీ ఏపీసోడ్ ని వర్మ చూపించబోతున్నాడు. ఎన్టీఆర్ కు చంద్రబాబు ఎలా వెన్నుపోటు పొడిచాడు. దానికి నందమూరి కుటుంబం ఎలా సహకరించింది అనేది చూపించబోతున్నాడు. దీంతోపాటు ఎన్టీఆర్-లక్ష్మీపార్వతీ లవ్ స్టోరీని ఆసక్తిగా చూపబోతున్నాడు.
నోటి మాటతోనే వర్మ సరిపెట్టలేదు. టీజర్, ట్రైలర్ తాను చూపించేబోయే నిజాలు ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో చూపాడు. ఎన్నికల హీట్ లోనే సినిమాని విడుదల చేస్తానని పట్టుబట్టీ మరీ.. విడుదల చేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఓ రేంజ్ లో జరిగింది. మొత్తంగా రూ. 12కోట్లు తీసుకొచ్చింది. రూ. 13కోట్లు వసూలు చేస్తే లక్ష్మీస్ ఎన్టీఆర్ సేఫ్.
సినిమా హిట్ టాక్ వస్తే రూ. 13కోట్లు రావడానికి మూడ్నాలుగు రోజులు చాలు. సంచలన విజయాన్ని నమోదు చేస్తే మాత్రం భారీ లాభాలు రావొచ్చు. ఈజీగా రూ. 50కోట్లు కలెక్ట్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అప్పుడు వర్మ ఎన్టీఆర్ ఆశీర్వాదం తమపైనే ఉందని సగర్వంగా ప్రకటించుకోవచ్చు. ఏదైమైనా.. ఈసారి వర్మని ప్రేక్షకులు గట్టిగా నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుంటే చాలు.. !