బ్రేకింగ్ : ఏపీ హైకోర్టులో ‘లక్షీస్ ఎన్టీఆర్’కు చిక్కెదురు.. విడుదల వాయిదా !
టీడీపీ నేతలు అనుకున్నది సాధించారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలని వాయిదా వేయించడం సక్సెస్ అయ్యారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా సెన్సార్, న్యాయపరమైన చిక్కులన్నీ దాటుకొని రేపు (మార్చి 29) విడుదలకి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఆన్ లైని లో అడ్వాన్స్ బుకింగ్ కూడా జరిగిపోయింది. రిలీజ్ పోస్టర్స్ వచ్చేశాయి. సినిమా విడుదల కోసం థియేటర్స్ ముస్తాబయ్యాయి.
ఇలాంటి సమయంలో టీడీపీ నేతలు చేసిన ఆఖరి ప్రయత్నం ఫలిచింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలని ఏప్రిల్ 11 వరకు ఆపాలంటూ మరోసారి కోర్టుని ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన మంగళగిరి హైకోర్టు లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై స్టే విధించింది. ఏపీ హైకోర్టు కూడా ఇదే తీర్పునిచ్చింది. దీంతో లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల వాయిదా పడక తప్పలేదు.
ఏప్రిల్ 15 వరకు సినిమాని విడుదల చేయకూడదు. సినిమా థియేటర్స్, సోషల్ మీడియా, యూట్యూబ్ తదితర మాధ్యమాలలో ప్రదర్శించకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కోర్టు ఆర్డర్స్ విడుదల చేసింది. దీనిపై వర్మ సుప్రీం కోర్టుకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఐతే, ఆయనకి అంత టైం కూడా లేదు. రేపే సినిమా విడుదల కావాల్సివుంది. మొత్తానికి.. టీడీపీ ఆఖరి దెబ్బ చాలా గట్టిగా కొట్టిందని చెప్పాలి.