‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలకి మంగళగిరి కోర్టు బ్రేక్ !

టీడీపీ నేతలు లోకల్ పవర్ చూపించారు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలకి అన్ని అడ్డంకులు తొలగాయి. సెన్సార్ పూర్తయింది. ఎన్నికల సంఘం క్లీన్ చీట్ ఇచ్చింది. కోర్టు చిక్కులు తొలగాయ్. దీంతో రేపు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకి లైన్ క్లియర్ అయినట్టయింది. సినిమా ఆన్ లైన్ బుకింగ్స్ అయిపోయాయి. రికార్డ్ స్థాయిలో టికెట్స్ తెగాయ్. ఇంతలో టీడీపీ నేతలు లోకల్ పవర్ చూపించారు. మంగళగిరి కోర్టు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలపై స్టే విధించింది.

ఈ సినిమాని అడ్డుకొనేందుకు టీడీపీ నేతలు అన్నీ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగా ఆఖరి ప్రయత్నంగా.. ఏప్రిల్ 11 వరకు లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలని ఆపాలంటూ ఎన్నికల సంఘానికి విజ్ఝప్తి చేశారు. మంగళ కోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పుడీ పిటిషన్ ని విచారించిన మంగళగిరి కోర్టు లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలపై స్టే విధించింది. ఐతే, ఈ తీర్పుపై మరికొద్దిసేపట్లో ఏపీ హైకోర్టులోనూ వాదనలు జరగనున్నాయి. హైకోర్టు కూడా అదే తీర్పునిస్తే.. లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల వాయిదా పడక తప్పదు.