యాక్సిడెంటులో విశాల్ కాలు, చేయి విరిగిందా.. ?

తమిళ్ హీరో విశాల్ మరోసారి గాయపడ్డారు. సుందర్ సి దర్శకత్వంలో విశాల్ తాజా చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ టర్కీలో జరుగుతోంది. అక్కడ ఓ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తున్న సమయంలో విశాల్ నడుపుతున్న బైక్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో విశాల్ చేయి, కాలుకి గాయాలయ్యాయి. ఆయన ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకొంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు బయటికొచ్చాయ్. వాటిని చూస్తే గాయాలు గట్టిగానే అయినట్టున్నాయి.

‘ఆయోగ్య’ సినిమా షూటింగ్ సమయంలోనూ విశాల్ గాయపడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఓ సాంగ్ ను షూట్ చేసే సమయంలో విశాల్ కు గాయాలు అయ్యాయి. ఇది జరిగి కొన్నాళ్లకే విశాల్ మళ్లీ గాయపడటం ఆయన అభిమానులని ఆందోళనకి గురి చేస్తోంది. రిస్క్ సీన్స్ చేయడానికి విశాల్ వెనకాడటం లేదు. అందుకే ఇలాంటి గాయాలు అవుతున్నాయని తెలుస్తోంది. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విశాల్.. షూటింగ్ ఇంకాస్త జాగ్రత్త వహిస్తే మంచిదని అభిమానులు సూచిస్తున్నారు.

ఇటీవలే హైదరాబాద్ అమ్మాయి అనీషానితో విశాల్ నిశ్చితార్థం జరిగింది. సెప్టెంబరులో వీరి వివాహ వేడుక జరగనున్నట్లు సమాచారం. అనీశాను ప్రేమిస్తున్నానని విశాల్‌ జనవరిలో ప్రకటించారు. ‘అయోగ్య’ సినిమా చిత్రీకరణ సమయంలో అనీశాతో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది విశాల్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె మంచితనం నచ్చి ముందు తనే ప్రపోజ్‌ చేసినట్లు తెలిపారు.