చంద్రబాబు న్యాయపోరాటం ఫలించలేదు

ఏపీ సీఎం చంద్రబాబు న్యాయపోరాటం ఫలించలేదు. ఐబీ చీఫ్‌తో పాటు కడప, శ్రీకాకుళం ఎస్పీలను బదిలీ చేస్తూ ఇటీవల ఎన్నికల సంఘం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈసీ తీరుపై మండిపడిన రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల విధులతో ఐబీ చీఫ్‌కు సంబంధం లేదని వాధించింది. ఆయన బదిలీని నిలుపుదల చేసింది. దీనిపై న్యాయపోరాటం చేసింది. హైకోర్టును ఆశ్రయించింది.

దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ఐపీఎస్‌ బదిలీల విషయంలో ఎన్నికల సంఘం జారీచేసిన ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తప్పని పరిస్థితుల్లో బదిలీ చేసింది. ఆయనను పోలీసు ప్రధాన కార్యాలయానికి రిపోర్టు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు సీఎస్‌ అనిల్‌ చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ చేశారు.