రైతులు ఒక్క పైసా లంచం ఇవ్వకండీ.. !
ఇటీవల భూ సమస్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొన్న శ్రద్ద దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. నేరుగా ముఖ్యమంత్రి ఓ యువకుడితో ఫోన్ లో మాట్లాడి.. అతడి భూ సమస్యని పరిష్కరించాడు. దానికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ తర్వాత ఇలాంటి లక్షల సమస్యలు వెలుగులోకి వచ్చాయి. అందరూ.. తమ భూ సమస్యలని సీఎం ఆఫీస్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై మిర్యాల గూడ ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ స్పందించారు.
భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ఓ నెలన్నర ఓపిక పట్టండి. జూన్ లో భూ సమస్యలన్నింటిని ప్రభుత్వం పరిష్కరిస్తుంది. అప్పటి వరకు రైతులు ఒక్క పైసా లంచం ఇవ్వకండీ. మూటేషన్.. లాంటి పనులు పెట్టుకోకండి. గ్రామాల్లో రైతుల భూ సమస్యల గురించి నాకు తెలుసు. వాటికి శాశ్వత పరిష్కారం చూపించబోతున్నామని తెలిపారు కేసీఆర్. లోక్ సభ ఎన్నికలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కేసీఆర్ వివాదంలో ఉన్న భూ సమస్యలపై ఫోకస్ చేయనుంది.