‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పబ్లిక్ టాక్

‘ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు’ని ప్రేక్షకులకు చూపించే ప్రయత్నమే లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ విషయాన్ని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మొదటి నుంచి చెబుతున్నాడు. అందుకే తగ్గట్టుగానే టీజర్, ట్రైలర్స్ ని వదిలాడు. సంచలన విషయాలతో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భారీ అంచనాల మధ్య లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఏపీలో తప్ప ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదలయింది. ఇప్పటికే బెనిఫిట్ షోస్ పడిపోయాయి. పబ్లిక్ టాక్ బయటికొచ్చింది.

సినిమా మొత్తంగా లక్ష్మీ పార్వతి-ఎన్టీఆర్-చంద్రబాబు-నందమూరి ఫ్యామిలీ చుట్టూనే కథ తిప్పాడు. లక్ష్మీ పార్వతి మీద పూర్తి స్థాయిలో సాఫ్ట్ కార్నర్ చూపించాడు . ఫస్టాఫ్ లో ఎన్టీఆర్-లక్ష్మీ పార్వతి మధ్య పరిచయం, అన్నోన్యత తదితర అంశాలు చూపించారు. లక్ష్మీ పార్వతీకి తొలి భర్త ఉండగానే.. ఆమె ఎన్టీఆర్ రొమాన్స్, పెళ్లి విషయాలని కన్విన్సింగ్ గా చూపించారు.

ఇక, సెకాంఢాఫ్ లో అసలు రాజకీయం చూపించాడు. ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు ఏపీసోడ్ ని తనదైన శైలిలో చూపించాడు వర్మ. ఒక్క మాటలో చెప్పాలంటే లక్ష్మీ పార్వతీ దేవతగా, చంద్రబాబు విలన్ గా చూపించే ప్రయత్నం చేశాడు వర్మ. లక్ష్మీపార్వతి పాత్రలో యజ్ఞాశెట్టి ఒదిగిపోయింది. ఎన్టీఆర్ పాత్రలో పి.విజయ్ కుమార్ కూడా ఫుల్ మార్క్స్ కొట్టేశాడు.

ఐతే, సినిమా సంచలన విజయం సాధించే రేంజ్ లో ఏం లేదు. వర్మ మార్క్ పైత్యం ఈ సినిమాలోనూ కనబడింది. స్లో నేరేషన్ ఇబ్బంది పెట్టింది. యావరేజ్ సినిమాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ మిగిలిపోయేలా ఉంది. ఈ సినిమా లక్ష్మీ పార్వతీతో పాటు, వైసీపీ అభిమానుల ఇగోని సంతృప్తి పరిచేలా ఉంది. టీడీపీ అభిమానులకి మాత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ కడుపుమంటని మిగిల్చనుందని చెప్పాలి.