మోడీకి డబుల్ ఇంజిన్ కావాలట !
ప్రధాని నరేంద్ర మోడీకి డబుల్ ఇంజిన్ కావాలట. డబుల్‌ఇంజిన్ అంటే కేంద్ర రాష్ట్రాల్లో భాజపా ప్రభుత్వం. దీనివల్ల రాష్ట్రాభివృద్ధి రెండింజిన్లపై పరుగులు పెడుతుందన్నారు. కర్నూలులో నిర్వహించిన ఎన్నికల ప్రచారసభలో మోదీ మాట్లాడారు. ఏపీలో డబుల్ ఇంజిన్‌తో పాలన కావాలంటే ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో భాజపాకు ఓటువేసి గెలిపించాలని కోరారు.
ఎస్‌యూఎన్ (SUN) అంటే ఉదయిస్తున్న సూర్యుడు.. ఎస్‌ఓఎన్ (SON) అంటే కుమారుడు.. భాజపాకు వేసే ఓటు వల్ల ఉదయించే ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుంది. ఏపీకి సూర్యోదయం కావాలా వద్దా? పుత్రుడి రాజకీయ భవిష్యత్తుకు సూర్యాస్తమయం కావాలి. రాష్ట్రంలో పుత్రుడి రాజకీయ భవిష్యత్తుకు సూర్యాస్తమయం కావాలని ప్రధాని పిలుపునిచ్చారు.
మోడీ దృష్టిలో డబుల్ ఇంజన్ అంటే.. కేంద్రంలో భాజాపా, ఏపీలో వైకాపా కావొచ్చని చెప్పుకొంటున్నారు. వైకాపా-భాజాపాల మధ్య ఎన్నికల రహస్య ఒప్పందం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఓ ఆంగ్ల మీడియా నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్ లో అది బయటపడింది. అందుకే కర్నూలులో మోడీ డబుల్ ఇంజన్ మాట అన్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.