యూవీ సిక్స్ లు కొడితే.. ఆ మజాయే వేరు.. !


యువరాజ్‌సింగ్‌ రెచ్చిపోతే ఎట్టుట్టదో తెలిసిందే. ఆరు బాల్స్ ఆరు సిక్స్ లు కొట్టిన ఘనత వీరుది. 2007 టీ20 ప్రపంచకప్‌లో ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు సాధించి యువరాజ్‌సింగ్‌ క్రికెట్‌ అభిమానులను అలరించిన విషయం తెలిసిందే నిన్న రాయల్ ఛాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో యువీ మళ్లీ ఆరు సిక్సులు బాదుతాడేమో అనే ఉత్సాహం అభిమానుల్లో నెలకొంది. హ్యాట్రిక్‌ సిక్స్‌లతో చెలరేగి ఆడుతున్న యువీ.. నాలుగో సిక్స్‌ బాదే క్రమంలో పెవిలియన్‌ చేరాడు. ఐతే, యూవీ హ్యాట్రిక్స్ సిక్స్ లు కొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.