జగన్.. అది సాధ్యం కానీ హామీ !
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే లక్ష ఉద్యోగాలని భర్తీ చేస్తామని తెరాస హామీ ఇచ్చింది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేసింది. ఐతే, నాలుగున్నరేళ్ల తెరాస పాలనలో దాదాపు 30వేల ఉద్యోగాలని మాత్రమే భర్తీ చేయగలిగింది. కోర్టు కేసులు, ఇతర కారణాల వలన లక్ష ఉద్యోగాల భర్తీ హామీని పూర్తిగా నెరవేర్చలేకపోయింది. ఆ ఎఫెక్ట్ తోనే ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విద్యార్థులు తెరాసపై కాస్త ఆగ్రహంగా కనిపించారు. ఆ తర్వాత ఆ పార్టీనే భారీ మెజారిటీతో గెలిపించారనుకోండీ.. !
ఐతే, ఇప్పుడు ఏపీలో జగన్ నిరుద్యోగులని ఖుషి చేసే హామీ ఒకటి ఇచ్చారు. రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగ యువత కోసం ఖాళీగా ఉన్న 2 లక్షల 30 వేల ఉద్యోగాలను ఒకే నోటిఫికేషన్‌తో భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఇది సాధ్యమా ? అనే చర్చ జరుగుతోంది. 2.3లక్షల ఉద్యోగాలకి ప్రభుత్వం ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేసినా.. కోర్టు కేసులు, ఇతరత్రా కారణాల వలన అదిసాధ్యం కాకపోవచ్చు.
రేపటి రోజున జగన్ మాట తప్పాడని ఏపీ విద్యార్థులు నిందిచొచ్చు. ఈ నేపథ్యంలోనే.. జగన్ కాస్త ఆలోచింది.. సాధ్యమయ్యే హామీలు ఇస్తే మంచిదేమో. ఫస్ట్ అయితే సీఎం కానీ.. తర్వాత ఉద్యోగాల భర్తీ గోల చూసుకోవచ్చన్నది జగన్ లక్ష్యం కావొచ్చేమో.. !