పులివెందులలో జగన్ ట్యాక్స్ నడుస్తోందా ?
పులివెందులలో జగన్ ట్యాక్స్ నడుస్తోందని సంచలన ఆరోపణలు చేశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. సోమవారం జగన్ సొంత నియోకవర్గం పులివెందులలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు చంద్రబాబు. పులివెందులలో జీఎస్టీ మాదిరిగా జేఎస్టీ (జగన్ ట్యాక్స్) ఉంది. 20శాతం వసూలు చేస్తున్నారు. ఇలాంటి ట్యాక్స్ ఎక్కడా చూడలేదు. కష్టం రైతులది, దోపిడీ మాత్రం జగన్ వర్గానిది. రైతులు పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితులు నెలకొన్నాయని సీఎం ఆరోపించారు. ఈ ఆటలు మా వద్ద సాగవని హెచ్చరించారు.
జగన్ టాక్స్ పై చంద్రబాబు చేసిన ఆరోపణలు షాక్ కి గురిచేస్తున్నాయి. నిజంగానే పులివెందుల ప్రజలు జగన్ టాక్స్ కడుతున్నారా.. ? అనే తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోంది. మరోవైపు, విజయవాడ, గుంటూరులో వాహనదారులు అమరావతి టాక్స్ కడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆ కారణంగా వాహనదారులు చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నట్టు వార్తలొచ్చాయ్. ఇప్పుడీ ప్రచారాన్ని తలదన్నే విధంగా పులివెందుల ప్రజలు జగన్ టాక్స్ కడుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు చంద్రబాబు. జగన్ టాక్స్ పై జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందనేది చూడాలి.