మజిలీ మరో మౌనరాగం ?


సమంత, నాగ చైతన్య భార్యభర్తలుగా నటిస్తున్నచిత్రం ‘మజిలీ’. శివ నిర్వాణ దర్శకుడు. ఈ వారమే (ఏప్రిల్ 5) మజిలీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాని మరో ‘మౌనరాగం’లా ఉంటుండనే హిట్ ఇచ్చాడు సంగీత దర్శకుడు థమన్. ఈ సినిమాకు థమన్ నేపథ్య సంగీతం అందించిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన మజిలీ ఆడియో వేడుకకి థమన్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా థమన్ మాట్లాడుతూ.. తనకు ‘మౌనరాగం’ లాంటి సినిమాకు నేపథ్య సంగీతం అందించాలనే కోరిక ఉండేది. ఆ కోరిక ‘తొలిప్రేమ’ సినిమాతో కొంతమేరకు తీరింది. ‘మజిలీ’ అలాంటి సినిమాయే. అద్భుతమైన ప్రేమకథ. చైతూ, సమంత అద్భుతంగా నటించారు. సామ్ నటనకి సరిగ్గా సరిపోయేలా నేపథ్య సంగీతం ఇచ్చుకుంటూ వెళ్లాను.

లైవ్ లేకపోతే లైఫ్ లేదు. ఈ సినిమా కోసం దాదాపు 106 మంది ఆర్కెస్టార్స్ పని చేశారు. బాంబేలో 70 వయోలెన్స్ సెక్షన్ పని చేసింది. మొత్తంగా మజిలీ నేపథ్య సంగీతం అద్భుతంగా కుదిరిందని చెప్పారు థమన్. ఇక, ఆఖరి నిమిషయంలో థమన్ తమకు దేవుడిలా దొరికాడు. మంచి నేపథ్య సంగీతాన్ని అందించారు. సినిమా రేంజ్ మరింత పెంచేశాడని మజిలీ చిత్రబృందం అంది.