చైతూని ఏడిపిస్తాడట !


భర్త నాగ చైతన్యని సమంత భరిస్తుందట. చైతూని భరించేంత శక్తి, సామర్థ్యం, కెపాసిటీ, ప్రేమ.. సమంతలో ఉన్నాయట. వీరిద్దరు భార్యభర్తలుగా నటిస్తున్న చిత్రం ‘మజిలీ’. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ వారమే (ఏప్రిల్ 5) ‘మజిలీ’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆదివారం హైదరాబాద్ లో మజిలీ ప్రీ రిలీజ్ వేడుక జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడిన దర్శకుడు శివ నిర్వాణ సినిమాలో సమంత నటన అద్భుతంగా ఉంటుంది. ఒక ఆడపిల్లకు ఉండే శక్తి అంతా ఆమె పాత్రలో కనిపిస్తుంది. అంతేకాదు.. ఇందులో చైతూ నటన ప్రేక్షకులని షాక్ కి గురిచేస్తుంది. పూర్ణ పాత్రలో చైతూ అద్భుతంగా నటించారు. సినిమా చూసిన తర్వాత చైతూ కనిపిస్తే.. ఆయన్ని కౌగిలించుకొని ఏడ్చేస్తారు. అంతలా ఉంటుందన్నారు.