పరిణీతిని కొరుక్కుతింటున్నాడుగా.. !

బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా ఒళ్లు కూర్చోన్న ఈ లడ్డు ఎవరో తెలుసా ? టెన్నిస్ స్టార్ తనయుడు #Izhaan. ఈ బుడ్డోడిని కొరుక్కు తినాలనిపిస్తుంది. కానీ, వాడే నా చేతినే తినేస్తున్నాడు అంటోంది పరిణీతి. పరిణీతి చేసిన ఈ ట్విట్ కు సానియా రిప్లై ఇచ్చింది. నీకు తెలుసా.. వాడు నిన్ను లవ్ చేస్తున్నాడని కామెంట్ చేసింది.

సానియా మీర్జా-సోయబ్ అక్తర్ దంపతులకి ఇటీవలే ఈబుడ్డోడు పుట్టిన సంగతి తెలిసిందే. తనయుడుని సానియా ముద్దుగా #MyLaddu పిలుచుకుంటోంది. తల్లైన తర్వాత సానియా మళ్లీ రాకెట్ పట్టింది. మళ్లీ దేశం కోసం ఆడేందుకు రెడీ అవుతోంది.

మరోవైపు, ఆర్ఆర్ఆర్ హీరోయిన్స్ లిస్టులో పరిణీతి చోప్రా పేరు కూడా వినిపించింది. ఐతే, ఆమెకు ఆ అవకాశం దక్కలేదు. ఆర్ ఆర్ ఆర్ కోసం అలియాభట్ ని తీసుకొన్న సంగతి తెలిసిందే. అలియా రామ్ చరణ్ కి జంటగా నటించనుంది. తారక్ కి జంటగా హాలీవుడ్ హీరోయిన్ ఎడ్గర్ జోన్స్ నటించనుంది.