చైన్నైకి స్ట్రోక్ తప్పింది


ఆదివారం రాత్రి చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో వేదికగా రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య పోరు రసవత్తరంగా జరిగింది. టాస్‌ ఓడి మొదటి బ్యాటింగ్‌ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది.
ఆదిలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయినా.. ఆఖరులో కెప్టెన్ ధోని (75) తనదైన శైలిలో రెచ్చిపోయాడు. చివరి ఓవర్లో ఏకంగా 28 పరుగులు వచ్చాయి.

చేధనలో రాజస్థాన్ ది అదే పరిస్థితి. ఆ జట్టు ఆరంభంలోనే మూడు వికెట్లు జేజార్చుకొంది. ఐతే, బెస్ స్ట్రోక్స్ (46, 26 బంతుల్లో) చెన్నైకి స్ట్రోక్ ఇచ్చేలా కనిపించాడు. చివరి మూడు ఓవర్లలో రాజస్థాన్‌ 44 పరుగులు చెయ్యాలి. ఆఖరి ఓవర్లో 12 పరుగులు చేయాలి. ఐతే, ఆఖరి ఓవర్ మొదటి బంతికే స్ట్రోక్ అవుట్ అయ్యాడు. దీంతో.. మ్యాచ్ చైన్నై చేతిలోకి వెళ్లింది. రాజస్థాన్ 167 పరుగులకే పరిమితం అయింది.