పంజాబ్ సప్రైజ్ విక్టరీ
మొహాలి వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 14 పరుగులతో తేడాతో ఢిలీని ఓడించింది. టాస్ గెలిచిన ఢిల్లీ ఫీల్డింగ్ ఎంచుకొంది. దీంతో మొదటి బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాట్స్‌మెన్ సర్ఫరాజ్ ఖాన్ 39, డేవిడ్ మిల్లర్ 43 పరుగులు చేశారు. దిల్లీ బౌలర్లు సందీప్ లామిచానె రెండు, రబాడ రెండు, క్రిస్‌మోరిస్ మూడు వికెట్లు పడగొట్టారు.
అనంతరం 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు.. చాలా సులభంగా గెలిచేలా కనిపించింది. పదహారు ఓవర్లు ముగిసేసరికి దిల్లీ 137/3తో నిలిచింది. నాలుగు ఓవర్లలో ఇంకా 30 పరుగులు చెయ్యాలి. ఇంతలో పంత్ (39), ఇన్ గ్రామ్ (38), క్రిస్ మోరిస్ (0), అక్షర్ పటేల్ (2) వికెట్లు టపా టపా పడిపోయాయి. ఆఖరి ఓవర్లో ఢిలీ జట్టుకి 15 పరుగులు అవసరం అయ్యాయి.
ఆఖరి ఓవర్ తొల బంతికే రబడ అవుటయ్యాడు. ఆ తర్వాతి బంతికే ఆఖరి వికెట్ కూడా కోల్పోయింది. దీంతో 14 పరుగుల తేడాతో పంజాబ్ గెలిచేసింది. పంజాబ్ బౌలర్లలో #SamCurran 4 వికెట్లు, అశ్విన్, షమి తలో రెండు వికెట్లు పడగొట్టారు.