సచిన్’లా కోహ్లీ ఫేలవుతున్నాడా ?
అంతర్జాతీయ క్రికెట్ లో సచిన్ సెంచరీల రికార్డుని బ్రేక్ చేసేలా కనిపిస్తున్నాడు విరాట్ కోహ్లీ. ఐతే, కెప్టెన్’గా కోహ్లీది దాదాపు సచిన్ పరిస్థితియే. అంతర్జాతీయ క్రికెట్లో పరుగుల వరద పారించిన సచిన్ కెప్టెన్ గా విఫలమయ్యాడు. కోహ్లీ కూడా కెప్టెన్ గా ఇంకా పరిణతి సాధించలేదని అంతర్జాతీయ క్రికెట్ పండితులు అంటారు. అదీ నిజమే. టీమిండియా విజయాల వెనక కోహ్లీ కెప్టెన్సీ కంటే.. మంచి జట్టు ఉండటమే కారణమని చెబుతుంటారు.
బ్యాట్స్మన్గా కోహ్లీ గొప్పవాడైనా సారథిగా విజయవంతం అయ్యాడని చెప్పేందుకు ట్రోఫీలే కదా సాక్ష్యాలు. ఐపీఎల్ లో కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న బెంగళూరు రాయల్ ఛాంలెజర్స్ ఇప్పటివరకు కప్ కొట్టలేదు. టోర్నీ సాంతం అద్భుత ప్రయాణం చేస్తుంది. ఆఖరి మెట్టుపై బోల్తా పడుతుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 12 బెంగళూరు జట్టు ఇంకా విజయాల ఖాతా తెరవలేదు. ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ పరాజయం పాలైంది.
జట్టు బలహీనంగా ఉందా.. ? అలాంటిదేమీ లేదు. అందరూ అందరే.. అరివీర భయంకరులే. అయినా.. ఆ జట్టు టోఫ్రీ గెలవకపోవడంపై మాజీలు విమర్శలు చేస్తున్నారు. కెప్టెన్ గా విరాట్ ని సచిన్ తో పోలుస్తున్నారు. సచిన్ మాదిరిగా విరాట్ కోహ్లీ గొప్ప బ్యాట్స్ మెన్. కానీ.. గొప్ప కెప్టెన్ కాదు అంటున్నారు. ఈ విమర్శలకి చెక్ పెట్టేలంటే ఈ ఐపీఎల్ లో బెంగళూరు జట్టు అనూహ్య పుంజుకొని.. కప్ ఎగరేసుకోవాల్సిందే.