సూర్యకాంతం ఖాతాలో రూ. 3కోట్లు

మెగా హీరోయిన్ నిహారిక నటించిన మూడో చిత్రం ‘సూర్యకాంతం’. గతవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం యావరేజ్ టాక్ ని సొంతం చేసుకొంది. కలెక్షన్స్ నిలకడగా ఉన్నాయి. ఇప్పటి వరకు సూర్యకాంతం రూ. 3కోట్లు కలెక్ట్ చేసింది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రంతో పోటీపడి మరీ.. సూర్యకాంతం ఈ రేంజ్ కలెక్షన్స్ రాబట్టడం గొప్ప విషయమేనని చెప్పాలి. ఐతే, ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల కాకపోవడం సూర్యకాంతంకి కొద్దిగా కలిసొచ్చింది. పోటీలో మరో సినిమా లేకపోవడంతో మంచి కలెక్షన్స్ రాబడుతోంది.

ఇప్పటికే సూర్యకాంతం నిర్మాతకు లాభాలొచ్చాయ్. సినిమాని చాలా తక్కువ బడ్జెట్ లో పూర్తి చేశారట. కేవలం శాటిలైట్, డిజిటల్ రైట్స్ తో సినిమా బడ్జెట్ వచ్చేలా ప్లాన్ చేయడం కలిసొచ్చింది. దీంతో సూర్యకాంతం వసూళ్లన్నీ లాభాల క్రింద మిగిలిపోతున్నాయి. ఈ చిత్రానికి బి. ప్రవీణ్ దర్శకత్వం వహించారు. నిహారిక జంటగా రాహుల్ విజయ్ నటించారు. నిహారిక సోదరుడు, హీరో వరుణ్‌తేజ్‌ సమర్పకుడిగా వ్యవహరించారు. సందీప్‌ ఎర్రం రెడ్డి, రామ్‌ నరేష్‌, సృజన్ ఎర్రబోలు‌ సంయుక్తంగా నిర్మించారు.