చిరు పొలిటికల్ ప్రచారంలో నిజం లేదట !

మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయన సాంకేతికంగా కాంగ్రెస్ నేత. అయినా… యాక్టివ్ గా లేరు. దేశంలో అంతా ఎన్నికల హడావుడిలో ఉంటే చిరు మాత్రం తన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’తో బిజీగా ఉన్నారు. అన్నయ్య చిరంజీవి దాదాపు పొలిటికల్ రిటైర్మెంట్ తీసుకొన్నట్టేనని ఇటీవల తమ్ముడు పవన్ కూడా ప్రకటించారు.

మరోవైపు, తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో చిరు ప్రచారం చేయబోతున్నాడు. ఆయన బంధువైన చేవేళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి తరుపున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారనే ప్రచారం జరిగింది. ఈ నెల 8 నుంచి చిరు ప్రచారంలోకి దిగనున్నారని చెప్పుకొన్నారు. లెటెస్ న్యూస్ ఏంటంటే ? చిరు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదు. ఆయన ప్రస్తుతం జపాన్ లో ఉన్నారు.

జపాన్ లో సైరా నరసింహారెడ్ది షూటింగ్ జరుగుతోంది. చిరుతో పాటు ఆయన సతీమణి సురేఖ కూడా అక్కడే ఉన్నారు. సైరా జపాన్ షెడ్యూల్ పూర్తికావడానికి ఇంకా టైం పట్టనుంది. ఈ నేపథ్యంలో చిరు తన ఓటు హక్కుని కూడా వినియోగించుకొనే పరిస్థితి లేదని తెలుస్తోంది. దీంతో.. ఇన్నాళ్లు చిరు పొలిటికల్ ప్రచారంపై జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజంలేదని తేలిపోయినట్టయింది.