టీడీపీ బలం పెంచిన కాంగ్రెస్ మేనిఫెస్టో ?
ఐదు ప్రధానాంశాలతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని విడుదల చేసిన సంగతి తెలిసిందే. అంతేకాదు.. అధికారంలోకి రాగానే ‘ఏపీకి ప్రత్యేక హోదా’ ఇస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొంది. ఇప్పుడిది ఏపీ ప్రజల్లో టీడీపీ పట్ల నమ్మకాన్ని పెంచనుందా ? అనే చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ తో కలిసి కేంద్రంలో తృతీయఫ్రంట్ ఏర్పాటు కోసం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చంద్రబాబు చక్రం తిప్పుతారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తారని ఏపీ ప్రజలు నమ్ముతున్నారు. ఆ నమ్మకాన్ని మరింత బలపరుస్తూ కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏపీ ప్రత్యేక హోదా అంశానికి చోటుచ్చింది. ఇది కచ్చితంగా ప్రజల్లో టీడీపీ పట్ల నమ్మకం పెంచే విషయమనే చెప్పుకొంటున్నారు.
మరోవైపు, 2014ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో కలిసి తిరిగింది. ఆనాడు ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ ఏపీపై వరాలు కురిపించారు. ఢిలీ అసూయపడేలా ఏపీ రాజధాని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తిరుమల వెంకటేశ్వరస్వామి సాక్షిగా బోలేడు హామీలు ఇచ్చారు మోడీ. ఐతే, వాటిలో వేటిని మోడీ నెరవేర్చలేదని ఇప్పుడు టీడీపీ నేతలే చెబుతున్నారు. అలాంటప్పుడు ఇప్పుడు ఏపీ ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ ఇస్తున్న హామిని ఎలా నమ్మమంటారని కొందరు అంటున్నారు. అదీ.. నిజమే. గత ఎన్నికలో మోడీతో హామీలు ఇప్పించి టీడీపీ లాభపడింది. ఈసారి కాంగ్రెస్ తో ఆ పని చేయిస్తుంది. అంతేతేడా. బీజేపీ మాదిరిగానే కాంగ్రెస్ కూడా ఏపీకి అన్యాయం చేయదని గ్యారెంటీ ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనిపై చంద్రబాబుని గట్టిగా ప్రశ్నిస్తే మంచిదేమో.. !!