సింగర్ మాళవికకు లైంగిక వేధింపులు

టాలీవుడ్ లో మరో సింగర్ వేధింపులకి గురైన విషయం వెలుగులోనికి వచ్చింది. సింగర్ మాళవికని ఓ వ్యక్తి చాలా ఇబ్బంది పెట్టాడట. ఒకరకంగా టార్చర్‌ చేశాడట. ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమంలో సింగర్స్‌ మాళవిక, కారుణ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాళవిక తనకు ఎదురైన చేధు అనుభవాన్ని పంచుకొంది.

“ఇండస్ట్రీలో కెమెరా డిపార్ట్‌మెంట్‌కు చెందిన వ్యక్తిగా పరిచయం చేసుకున్నాడు. చాలా ఇబ్బంది పెట్టాడు. ఒకరకంగా టార్చర్‌ చేశాడు. రోజూ ఫోన్ల మీద ఫోన్లు, ఎస్‌ఎంఎస్‌లు చేసేవాడు. మేము దాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. ఓ ప్రోగ్రామ్ కోసం వెళ్లినప్పుడు సడెన్‌గా ఒక మెస్సేజ్‌ వచ్చింది. సౌందర్య బర్త్‌డే.. డెత్‌ డే, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బర్త్‌డే.. డెత్‌డే, ఇలా సెలబ్రిటీల పుట్టిన రోజులు.. చనిపోయిన రోజులు రాసి చివరకు ‘మాళవిక బర్త్‌డే.. రాసి డెత్‌ డే’ అంటూ క్వశ్చన్‌ మార్క్‌ పెట్టాడు. నాకు చాలా భయం వేసింది. ఆ సందేశాన్ని శివారెడ్డి, అభినయ్‌కృష్ణలకు చూపించా. వాళ్లు వేరే ఫోన్‌ నుంచి అతని నెంబర్‌కు కాల్‌ చేసి.. డీఎస్పీని మాట్లాడు తున్నా
నని, మాళవిక మీపై కేసు పెట్టారని కాస్త గట్టిగా వార్నింగ్‌ ఇచ్చారు. అంతే అప్పటి నుంచి మళ్లీ నాకు ఫోన్‌ రాలేదు” అని తెలిపింది.

సింగర్ చిన్మయి శ్రీపాద లైంగిక వేధింపులకి గురైన సంగతి తెలిసిందే. దక్షిణాది #మీటూ ఉద్యమాన్ని ప్రారంభించిన చిన్మయి..
ప్రముఖ రచయిత వైరముత్తు, డబ్బింగ్ ఆర్టిస్టు యూనియన్ ప్రసిడెంట్ రాధారవిలపై లైంగిక ఆరోపణలు చేసింది. అంతేకాదు.. లైంగిక వేధింపులకి గురైన మహిళలకి బాసటగా నిలిచింది. వారు ఎదుర్కొన్న లైంగిక వేధింపులని బయటపెట్టేందుకు మనోధైర్ఘ్యాని ఇచ్చింది. ఈ క్రమంలో చిన్మయిని ఆమె ప్రత్యర్థులు టార్గెట్ చేయడం.. డబ్బింగ్ యూనియన్ నుంచి తొలగించడం జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ కేసు విచారణలో ఉంది.