రస్మిక బర్త్ డే గిఫ్ట్.. ఏంటో ?

విజయ్‌ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్న చిత్రం ‘డియర్‌ కామ్రేడ్‌’. భరత్‌ కమ్మ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. మే 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. శుక్రవారం రష్మిక పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం సర్‌ప్రైజ్‌ ఇవ్వనుంది. ఈ విషయాన్ని కథానాయకుడు విజయ్‌ దేవరకొండ ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు.

“రేపు(శుక్రవారం) ఉదయం 9గంటలకు మా నుంచి రష్మికకు బర్త్‌డే స్పెషల్‌ వస్తుంది’ అంటూ పేర్కొంటూ ‘హ్యాపీబర్త్‌డే లిల్లీ” అంటూ హ్యాష్‌ట్యాగ్‌ పెట్టారు. దీనికి రష్మిక స్పందిస్తూ, ‘ఆ సర్‌ప్రైజ్‌ నాకు ఒక్కదానికే తెలుసా? లేదా అందరికీ తెలుసా?నువ్వైనా చెప్పవా ప్లీజ్‌’ అంటూ ట్వీట్‌ చేశారు. ఇంతకీ రష్మిక బర్త్‌డే స్పెషల్‌ ఏమై ఉంటుంది అంటారు..?

విజయ్, రస్మిక తొలిసారి ‘గీత గోవిందం’ సినిమా కోసం జతకట్టారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఏకంగా రూ. 100 క్లబ్ లో చేరిపోయింది. ఈ సినిమాతో విజయ్-రస్మిక హిట్ పెయిర్ అనిపించుకొన్నారు. ఈ హిట్ పెయిర్ నటిస్తున్న రెండో సినిమా డియర్ కామ్రేడ్. అన్నట్టు ఇందులో వీరిమధ్య అదిరిపోయే లిప్ లాక్ ఉంది. టీజర్ లో దాన్ని చూసే భాగ్యం ప్రేక్షకులకి కలిగింది. ఐతే, దాని వెనకున్న ఎమోషన్స్ ని సినిమాలో చూడాల్సిందే.