మజిలీ.. రంగస్థలం రేంజ్ హిట్


‘రంగస్థలం’ సినిమా రామ్ చరణ్ లోని అసలు సిసలు టాలెంట్ ని బయటికి తీసింది. చిట్టిబాబు పాత్రలో చరణ్ ఒదిగిపోయాడు. ఆ పాత్రకు ప్రశంసల వర్షం కురిసింది. ఈ సినిమాతో చరణ్ నటుడిగా ఓ మెట్టు పైకి ఎక్కేశాడు. ఇప్పుడు ‘మజిలీ’ కూడా నాగ చైతన్యకు ‘రంగస్థలం’ లాంటి సినిమా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

పూర్ణ పాత్రలో చైతూ అద్భుతంగా నటించాడు. ఇన్నాళ్లకి చైతూకి సరిపోయే పాత్ర దొరికింది. తన టాలెంట్ ని పూర్తిస్థాయిలో చూపించే ఛాన్స్ దొరికింది. దాన్ని చైతూ సద్వినియోగం చేసుకొన్నాడని చెప్పుకొంటున్నారు. ఇక, ఎప్పటిలాగే సమంత తన నటనతో షాక్ ఇచ్చింది. చైతూ, సామ్ ఇద్దరి నటనపై ప్రశంసలు కురుస్తుండటంతో.. మజిలీ అక్కినేని ఫ్యామిలీకి డబుల్ ట్రీట్ అని చెప్పాలి.