ఫస్ట్ రివ్యూ : మజిలీ – ఓ అందమైన అనుభూతి

నాగ చైతన్య – సమంత కలిస్తే ఏదో మ్యాజిక్ జరుగుతుంటుంది. ఆ మేజిక్ ని ప్రేక్షకులు ‘ఏం మాయ చేశావె’, ‘మనం’ సినిమాల్లో చూశారు. పెళ్లైన తర్వాత ఈ జంట నటించిన తొలి చిత్రం ‘మజిలీ’. శివ నిర్వాణ దర్శకుడు. పాటలు, టీజర్, ట్రైలర్ లతో సామ్-చై మరోసారి మ్యాజిక్ చేయబోతున్నారనే విషయం అర్థమైంది. దీంతో మరికొద్ది గంటల్లో విడుదల కాబోతున్న ‘మజిలీ’ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫస్ట్ షాక్ ఎలా ఉండబోతుంది. ఫస్ట్ రివ్యూ ఎవరిస్తారు ? అని ఎదురు చూస్తున్నారు.

ప్రేక్షకుల కోరికని అక్కినేని హీరో సుశాంత్ తీర్చేశారు. ‘మజిలీ’ ఫస్ట్ రివ్యూని అందించాడు. మజిలీ అద్భుతంగా ఉంది. ఇదో
అందమైన కథ. దాన్ని దర్శకుడు చాలా సున్నితంగా డీల్ చేశారు. లవ్ ఉన్నదగ్గరే పెయిన్ కూడా ఉంటుంది. ఈ రెండింటినీ ఆస్వాదించే విధంగా సినిమాలో చూపించాడు. పూర్ణ, శ్రావణి పాత్రలకి చై-సామ్ ప్రాణం పోశారు. పాత్రల్లో జీవించేశారు” అంటూ ట్విట్ చేశాడు సుశాంత్. తొలి సినిమా అయినా.. దివ్యాంక న బాగా నటించిందన్నారు.

టెక్నికల్ గా సినిమా బాగుంది. గోపిసుందర్ అందించిన పాటలు వినడానికి, తెరపై చూడ్డానికి బాగున్నాయి. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది. సినిమా స్థాయిని పెంచింది. మొత్తంగా.. సినిమా చాలా బాగుందంటూ అక్కినేని అభిమానులకి తీపికబురు చెప్పాడు సుశాంత్. మరికొద్దిసేపట్లో మజిలీ పూర్తి రివ్యూ రాబోతుంది. అందులో సినిమా గురించి ఇంకాస్త డీప్ విశ్లేషించుకొందాం. అప్పటి వరకు వాచ్ చేస్తూనే మీ టీఎస్ మిర్చి డాట్ కామ్.