‘మజిలీ’ షాకింగ్ ప్రీమియర్ కలెక్షన్స్

నాగ చైతన్య-సమంత కలిస్తే మేజిక్కే. పదేళ్ల క్రిందటే ‘ఏం మాయ చేశావె’ మేజిక్ చేసింది.. ఈ జంట. వీరిద్దరు కలిసి నటించిన తాజా చిత్రం ‘మజిలీ’. ఉగాధి కానుకగా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఐతే, గురువారమే యుఎస్ బాక్సాఫీస్ దగ్గర ప్రీమియర్ షోస్ పడిపోయాయి. ప్రీమియర్ షోస్ ద్వారా మజిలీ మంచి కలెక్షన్స్ రాబట్టినట్టు సమాచారమ్.

యుఎస్ లో ‘మజిలీ’ 112 లొకేషన్స్ లో ప్రీమియర్ షోస్ ప్రదర్శించారు. వీటి ద్వారా $125,149 డాలర్లు రాబట్టింది. ఓవర్సీస్ లో చైతూ ఇమేజ్ దృష్ట్యా ఇవి మంచి కలెక్షన్స్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మధ్య కాలంలో ఇలాంటి మనసు హత్తుకొనే సినిమా రాలేదని చెబుతున్నారు. మంచి టాక్ నేపథ్యంలో మజిలీ యుఎస్ కలెక్షన్స్ పెరిగేలా కనిపిస్తున్నాయి.

ఈ సినిమా రూ. 21కోట్ల ప్రీ రిలీజ్ చేసింది. సినిమాకు వచ్చిన హిట్ టాక్ నేపథ్యంలో ఈ మొత్తం తొలివారంలోనే రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండో వారం నుంచి వచ్చేవన్నీ లాభాలే. మొత్తంగా.. మజిలీ సూపర్ హిట్ టాక్ తో భారీ లాభాలని తీసుకొచ్చేలా కనిపిస్తోంది.