‘మజిలీ’ ట్విట్టర్ రివ్యూ – సూపర్ హిట్ (3.5/5)

నాగచైత్య-సమంత భార్యభర్తలుగా నటించిన చిత్రం ‘మజిలీ’. శివ నిర్వాణ దర్శకుడు. భారీ అంచనాల మధ్య ‘మజిలీ’ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటికే బినిఫిట్ షోస్ పడిపోయాయి. సినిమా చూసిన అభిమానులు తమ అభిప్రాయాన్ని ట్విట్టర్ వేదికగా పంచుకొంటున్నారు. సినిమా అద్భుతంగా ఉందని చెబుతున్నారు. దర్శకుడు శివ నిర్వాణ బలమైన కథని రాసుకొన్నారు.

ఆ కథని తెరపై ఇంకా అద్భుతంగా చూపించారు. కథ, కథనం అద్భుతంగా కుదిరాయి. గుండెని పిండేసే మాటలు రాశారు. ఎమోషన్స్ బాగా పండాయి. ముఖ్యంగా దర్శకుడు క్లైమాక్స్ నడిపించిన తీరు అద్భుతం. శివ నిర్వాణ మరోసారి గుండెని పిండేశాడు. ఇక, సమంత, చైతూ నటన అదిరిపోయింది. ‘ఏం మాయ చేశావె’ సినిమా వచ్చి పదేళ్లు అవుతున్నా.. సామ్-చైలో ఏమాత్రం ప్రేమ తగ్గలేదు. అదే మేజిక్ వర్కవుట్ అయ్యింది. ఎమోషనల్ సీన్స్ లో సమంత నటన అద్భుతం. ముఖ్యంగా సెకాంఢాప్ లో నట విశ్వరూపం చూపించేసింది. చైతూకి కెరీర్ లోనే బెస్ట్ ఫర్ ఫామెన్స్ ఇచ్చారు.

దర్శకుడు, హీరో-హీరోయిన్స్ తో సమానంగా సంగీత దర్శకుడు థమన్ క్రెడిట్ ఇవ్వాలి. నేపథ్య సంగీతంతో సినిమా రేంజ్ ని పెంచేశారు. ఎమోషనల్ సీన్స్ కోసం థమన్ అందించిన నేపథ్య సంగీతం బాగా కుదిరింది. మణిరత్నం సినిమాలోని నేపథ్య సంగీతం రేంజ్ లో ఉంది. ఫైనల్ గా మజిలీ సూపర్ హిట్. చై-సామ్ ఇద్దరికి ఇదో గొప్ప సినిమా.