‘బంగారు బుల్లోడు’గా అల్లరోడు ఫస్ట్ లుక్

ప్లాపుల్లో ఉన్న అల్లరి నరేష్ ఆశలన్నీ సూపర్ స్టార్ మహేష్ బాబుపైనే పెట్టుకొన్నాడు. మహేష్ 25వ చిత్రం ‘మహర్షి’లో అల్లరోడు కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నరేష్ మహేష్ స్నేహితుడిగా కనిపిస్తారట. ఆయన పాత్రే కథని మలుపు తిప్పుతుందని చెబుతున్నారు. మే9న మహర్షి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

మరోవైపు హిట్ కోసం నరేష్ సోలోగానూ ప్రయత్నిస్తున్నాడు. పివి. గిరి దర్శకత్వంలో అల్లరోడు హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని ఏకె ఎంటర్ ట్రైన్ మెంట్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ‘బంగారు బుల్లోడు’ టైటిల్ ని ఖరారు చేశారు. ఉగాది కానుకగా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు. టైటిల్ కి తగ్గట్టే ఫస్ట్ లుక్ లో అల్లరోడు మెడలో బంగారు అభరణాలు వేసుకొని మురిసిపోతూ కనిపిస్తున్నాడు.

బాలకృష్ణ హీరోగా రమ్యకృష్ణ- రవీనా టాండన్ లు హీరోయిన్స్ గా నటించిన ‘బంగారు బుల్లోడు’ చిత్రం అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడీ టైటిల్ ని అల్లరోడు వాడుకొంటున్నాడు. మొత్తంగా.. ఓ హిట్ కోసం అల్లరోడు ఇటు మహేష్ బాబు, అటు బాలయ్యపై ఆశలు పెట్టుకొన్నట్టు కనిపిస్తోంది. వీరిద్దరిలో అల్లరోడికి ఎవరు హిట్ ఇస్తారనేది చూడాలి.