‘మజిలీ’ తొలిరోజు కలెక్షన్స్

పదేళ్లయినా నాగ చైతన్య-సమంతల మధ్య ఏమాత్రం ప్రేమ తగ్గలేదు. పదేళ్ల క్రితం వచ్చిన ‘ఏం మాయ చేశావె’ చిత్రంలో ప్రేక్షకులని మాయ చేసింది ఈ జంట. ఇప్పుడు ‘మజిలీ’ సినిమాలోనూ అదే మేజిక్ వర్కవుట్ అయ్యింది. ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘మజిలీ’ హిట్ టాక్ సొంతం చేసుకొంది. కలెక్షన్స్ ఆ రేంజ్ లో ఉన్నాయి. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందు కొచ్చిన మజిలీ తొలిరోజు రూ. 5కోట్ల కలెక్షన్స్ వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు భావించాయి. ఐతే. అంచనాలని మించి మజిలీ తొలిరోజు రూ. 7.10కోట్లు కలెక్ట్ చేయడం విశేషం.

ఏరియాలవారీగా చూస్తే… నైజాం – రూ. 1.94కోట్లు, వైజాగ్ – రూ. 0.76కోట్లు, తూ. గోదావరి 0.28కోట్లు, ప. గోదావరి రూ. 0.27కోట్లు, కృష్ణా – 0.37కోట్లు గుంటూరు – 0.67కోట్లు, నెల్లూరు – రూ. 0.18కోట్లు, సీడెడ్ రూ. 0.0.75కోట్లు, నైజాం + ఏపీ – రూ. 5.22కోట్లు. యుఎస్ – రూ. 0.88కోట్లు, కర్నాటక రూ. 0.73కోట్లు, ఇతర ప్రాంతాల నుంచి రూ. 0.25కోట్లు. మొత్తం రూ. 7.10కోట్లు తొలిరోజు తీసుకొచ్చింది మజిలీ.

మజిలీ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 22కోట్ల వరకు జరిగింది. హిట్ టాక్ తో ఈ మొత్తం కూడా తొలివారంలోనే వచ్చేలా కనిపిస్తోంది. ఇక రెండో వారం నుంచి వచ్చేదంతా లాభాల కిందే లెక్క. ఈ లెక్కన మజిలీ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పవచ్చు. చై-సామ్ జంటగా నటించిన తొలి చిత్రం ఏం మాయ చేశావె సూపర్ హిట్ అయింది. పెళ్లి తర్వాత ఈ జంట తొలిసారి జంటగా నటించిన మజిలీ సూపర్ హిట్ అయ్యిందని చెప్పవచ్చు.