రజనీ సినిమాలో నివేదా ?


ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్‌ ఏప్రిల్‌ 10న చెన్నైలో ప్రారంభం కానున్నట్లు తెలిసింది. ఈ సినిమాలో నయనతార కథానాయిక నటించనున్నారు. అంతేకాదు.. ఇందులో రజనీ కుమార్తె పాత్ర కోసం దర్శక, నిర్మాతలు నివేదా థామస్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. 2015లో వచ్చిన ‘పాపనాశం’ (దృశ్యం) సినిమాలో కమల్‌ హాసన్‌ కుమార్తెగా నటి నివేదా థామస్‌ నటించారు. ఆ తర్వాత ఆమె హీరోయిన్ గా బిజీ అయ్యారు.

ఇక, ఈ సినిమాలో ఎస్.జె. సూర్య ప్రతినాయకుడి పాత్రలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల చెన్నైలోని ప్రముఖ స్టూడియోలో ఈ చిత్రానికి సంబంధించి రజనీ లుక్‌ టెస్ట్‌ జరిగింది. ఈ ఫొటోలు లీక్‌ అయ్యాయి. ఈ సినిమాకు సంతోష్‌ శివన్‌ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. అనిరుధ్‌ సంగీతం సమకూరుస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించనుంది.