సన్ రైజర్స్ ఓటమి
137 పరుగుల లక్ష్య ఛేదనలో సన్రైజర్స్ హైదరాబాద్ 17.4 ఓవర్లలో 96 పరులకే ఆలౌట్ అయ్యింది. దీంతో 41 పరుగులతో తేడాతో ముంబై ఇండియన్స్ గెలుపొందింది. ముంబై బౌలర్ అల్జారి జోసెఫ్ సంచలన బౌలింగ్ చేశాడు. కేవలం 3.4 ఓవర్లు వేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.
అంతకుముందు పోలార్డ్ 46 (26బంతుల్లో) నాటౌట్ ఆఖర్లో అదరగొట్టడంతో ముంబై ఇండియన్స్ 136 పరుగులు చేసింది. మొదటి నుంచి సన్ రైజర్స్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. ముంబై 10ఓవర్లలో 52/3గా నిలిచింది. 13ఓవర్లలో 65/7,18ఓవర్లలో 97/7 నిలిచింది. ఐతే, ఆఖరి రెండు ఓవర్లలో పోలార్డ్ 4 సిక్సలు, 2 ఫోర్లతో గేర్ మార్చాడు. ఫలితంగా ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది.