‘వెంకీ మామ’ ఫస్ట్ లుక్


వెంకటేష్‌, నాగచైతన్యలు తమ అభిమానులకు ఉగాది పండగ రోజున గిఫ్ట్‌ ఇచ్చేశారు. బాబీ దర్శకత్వంలో వీరిద్దరూ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘వెంకీమామ’. రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌ కథానాయికలు. ఉగాది కానుకగా ఈ సినిమ ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు.

గ్రామీణ నేపథ్యంతో పాటు ఆర్మీ నేపథ్యంలోనూ కథ సాగుతుందని టైటిల్‌ లోగోను చూస్తే అర్థమవుతోంది. ఇందులో వెంకటేష్‌, నాగచైతన్యలు ధాన్యం బస్తాలపై చిరునవ్వులు చిందిస్తూ కూర్చొన్నారు. పోస్టర్‌లో కనిపించిన ద్విచక్రవాహన చక్రంపై కూడా ‘జై జవాన్‌.. జైకిసాన్‌’ టైటిల్‌ కనిపిస్తోంది. వెంకీ కిసాన్ గా, చైతూ జవాన్ కనిపించబోతున్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. సురేశ్‌ ప్రొడక్షన్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

ఈ యేడాది వెంకీ, చైతూ చెరొక హిట్ కొట్టారని చెప్పవచ్చు. ఈ యేడాది సంక్రాంత్రి కానుకగా వచ్చిన వెంకీ, వరుణ్ తేజ్ ల మల్టీస్టారర్ ‘ఎఫ్ 2’ సూపర్ హిట్ అయ్యింది. ఇక, ఉగాధి కానుకగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన చైతూ మజిలీ హిట్ టాక్ ని సొంతం చేసుకొంది. ఈ లెక్కన వెంకీ, చైతూ చెరో హిట్ కొట్టేసి.. మరో హిట్ కోసం కలిసి నటిస్తున్నట్టుంది.