లోకేష్’కు చెక్ పెట్టిన వర్మ
తెలుగుదేశం పార్టీ నందమూరి కుటుంబం నుంచి ఎప్పుడో చేజారింది. నారా కుటుంబం చేతుల్లోకి వెళ్లింది. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు పార్టీని లాగేసుకొన్నాడు. తిరిగి టీడీపీ నందమూరి కుటుంబం చేతుల్లో వెళ్తుందా ? అంటే.. ఛాన్సే లేదు. ఇప్పటికే చంద్రబాబు తన రాజకీయ వారసుడుగా తనయుడు లోకేష్ ని తెరపైకి తీసుకొచ్చారు. మంత్రిని కూడా చేశాడు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. లోకేష్ ని ముఖ్యమంత్రిని చేసే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టొచ్చు.
లోకేష్ ప్రతిభపై సొంత పార్టీ నేతల్లోనే అనుమానాలున్నాయి. కానీ, ఒక్కరు నోరు తెరిచే ప్రయత్నం చేయరు. ఆ ధైర్ఘ్యం చేశారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. టీడీపీకి నారా లోకేష్ అసలైన వారసుడు కాదు. నిజమైన వారసుడు జూ ఎన్టీఆర్. టీడీపీకి మంచి భవిష్యత్తును తీసుకొచ్చే వారసుడు కేవలం తారక్ మాత్రమేనని వర్మ ప్రకటించారు. అంతేకాదు.. ఎన్టీఆర్ అబిమానులంతా ముందు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా చూసి.. ఆ తర్వాత ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరాడు వర్మ.