చైతూ మంచి మొగుడు

హీరోయిన్ సమంతకి ఇష్టమైనవి రెండో రెండు. ఒకటి నిద్ర, ఇంకోటి మంచి మొగుడు. ఈ రెండు కూడా సామ్ కి ఒకే చోట దొరికేశాయ్. తన భర్త నాగచైతన్య భుజాలపై సేదతీరుతున్న ఫోటోని సామ్‌ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ఈ ఫోటోకు ‘చివరికి.. మిగిలినవేవీ అవసరం లేదు.. జీవితంలో ప్రేమ ఒకటి చాలు ..’ అనే అర్థంతో వచ్చేలా క్యాప్షన్‌ ఇచ్చింది. ఇప్పుడీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముచ్చటైన దంపతులు అని కామెంట్లు చేశారు.

మరికొందరు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో సామ్‌ డైలాగ్‌ను ఫొటోకు జత చేశారు. ‘నాకు ఇష్టమైనవి రెండే రెండు.. ఒకటి నిద్ర, ఇంకోటి మంచి మొగుడు’ అనే డైలాగ్‌ను ఫొటోపై రాశారు. దీన్ని సమంత తిరిగి రీట్వీట్‌ చేశారు. నవ్వుతున్న ఎమోజీలను షేర్‌ చేశారు. ఇక, చై-సామ్ భార్యభర్తలుగా నటించిన చిత్రం మజిలీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిట్ టాక్ ని సొంతం చేసుకొంది. కేవలం రెండ్రోజుల్లోనే రూ. 21కోట్లు కలెక్ట్ చేసింది.