పరిషత్ ఎన్నికలకు ఈసీ గ్రీన్ సిగ్నల్
లోక్సభ ఎన్నికలు ముగియగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ఈసీని కోరిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఈసీ లోక్సభ పోలింగ్ అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఇబ్బందిలేదని పేర్కొంది. ఐతే, లోక్సభ ఫలితాల తర్వాతే స్థానిక సంస్థల ఫలితాలు వెల్లడించాలని ఈసీ స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో ఈనెల మూడో వారంలో స్థానిక సంస్థల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశముంది. రాష్ట్రంలో 2014లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించారు. ఈసారి మాత్రం రెండు లేదా మూడు విడతల్లో చేపట్టనున్నారు. ఎన్ని విడతలు అనేది జిల్లాల కలెక్టర్లు, ఎస్పీల నుంచి వచ్చే ప్రతిపాదనల ఆధారంగా ఈసీ నిర్ణయించనుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలతో పాటు మున్సిపల్ ఎలన్నికలని నిర్వహించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.