జగన్‌కు పవన్‌ సవాల్‌


ఎన్నికల వేళ రాజకీయ ప్రత్యర్తులు సవాళ్లు-ప్రతి సవాళ్లు విసురుకోవడం సహజమే. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైకాపా అధినేత వైఎస్ జగన్ ని చాలా సార్లు, చాలా విషయాల్లో సవాల్ చేశారు. ఐతే, తాజాగా పవన్ చేసిన సవాల్ ఆకట్టుకుంటోంది. కేసీఆర్‌ తన ఫ్రెండ్‌ అంటారుగా. ప్రత్యేక హోదాకు అనుకూలమని కేసీఆర్‌తో ప్రకటన చేయించగలరా.. ? జగన్ ని సవాల్ చేశారు పవన్.

పవన్ రాజకీయాల్లో పండిపోకున్నా.. ఈ మధ్య ఆక్టివ్ గా ఉంటున్నారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మీడియాలో మాట్లాడిన కేసీఆర్.. ఏపీ ప్రత్యేక ఇవ్వాలని, అందుకు తాము సహకరిస్తామని పేర్కొన్నారు. ఈ విషయంలో అవసరమైతే క్ కేంద్రానికి లేఖ కూడా రాస్తం అన్నారు. ఇవి పవన్ కి తెలీయదా ? పవన్ కూడా రెచ్చగొట్టు రాజకీయాలు మొదలెట్టినట్టుండు. మళ్లీ తిరిగి కేసీఆర్ కౌంటర్ ఇస్తే.. ఏడపడుతడో మరీ… !